మూసి నదిపై సీఎం రేవంత్, అమ్రపాలి చర్చ

మూసి నదిపై సీఎం రేవంత్, అమ్రపాలి  చర్చ

విదేశీ పర్యటనలో  ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్టేట్ అభివృద్ధే లక్ష్యంగా  పలు సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ , అర్బరన్ డెవలప్ మెంట్, గ్రీన్ స్పేసెస్ లపై ప్రధానంగా ఫోకస్ చేశారు. టాప్ గ్లోబల్ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేప్ డిజైనర్లతో సమావేశమయ్యారు. 56కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్ లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలపై చర్చించారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం 70 సంస్థల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించనున్నారు.

హైదరాబాద్ కు వచ్చిన బెస్ట్ ఇన్ క్లాస్ సంస్థలను స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిసమీపంలోని నగరాలు అభివృద్ధి చెందాయన్నారు. మూసీని పునరుద్ధరిస్తే.. హైదరాబాద్ అరుదైన నగరంగా ఆవిష్కృతం అవుతుందని చెప్పారు. అత్యంత ప్రాతిష్టాత్మకంగా..ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇతర భారతీయ నగరాలతో తానెప్పుడూ పోటీ పడటం లేదని.. ప్రపంచస్థాయి అత్యుత్తమమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు సీఎం.  ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగొచ్చే ముందు..దుబాయ్ లో కీలక  సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో అధికారులు అమ్రాపాలి, దానకిషోర్, శేషాద్రి, అజిత్ రెడ్డి పాల్గొన్నారు.