పంద్రాగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు..27.50 లక్షల మంది 9 రకాల వస్తువులు : సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి

పంద్రాగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు..27.50 లక్షల మంది 9 రకాల వస్తువులు : సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి
  • పాలమూరులో ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ పాలసీ అమలు చేస్తం 
  • పిల్లలకు జర్మన్​, జపాన్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియన్‌‌‌‌ భాషలు నేర్పాలని సూచన
  • వనపర్తి జిల్లా కొత్తకోట స్కూల్‌‌‌‌ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ ప్రసంగం
  • అమరరాజా గిగా కారిడార్‌‌‌‌‌‌‌‌లో కస్టమర్​ క్వాలిఫికేషన్​ ప్లాంట్​ ప్రారంభం

వనపర్తి/మహబూబ్‌‌నగర్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు ఆగస్టు 15లోగా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్​ కిట్లను అందజేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడ్యుకేషన్​, ఇండస్ట్రీ పాలసీ అమలు చేస్తామని, ఇక్కడి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో జడ్పీ గర్ల్స్‌‌​ హైస్కూల్​ కొత్త భవనాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడంవల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉస్మానియా వర్సిటీ వందేండ్ల ఉత్సవాన్ని కూడా జరుపుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రికెట్​, బాక్సింగ్​ క్రీడల్లో ప్రతిభ చూపిన మహ్మద్‌‌ సిరాజ్‌‌, నిఖత్​ జరీన్‌‌కు గ్రూపు-1 పోస్టులిచ్చి గౌరవించినట్టు గుర్తు చేశారు.

 ప్రభుత్వం ఒక్కో విద్యార్థి మీద ఏడాదికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 18 లక్షల మంది విద్యార్థులున్నారని, అదే 11 వేల ప్రైవేట్‌‌ స్కూళ్లలో 33 లక్షల మంది విద్యార్థులున్నారని, ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వల్లే పేదలు కూడా ప్రైవేటు బాట పడుతున్నారన్నారు. కొత్తకోట గర్ల్స్ స్కూల్‌‌లో 2023లో 350 మంది స్టూడెంట్లు ఉన్నారని, ఒక్క గదిలోనే రెండు క్లాసులు నడిచినా అప్పటి లీడర్లు పట్టించుకోలేదని తెలిపారు. 

మధుసూదన్​రెడ్డి ఎమ్మెల్యే కాగానే స్కూల్‌‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. 16  ఏండ్లుగా ప్రమోషన్లు లేని టీచర్లకు తాము అధికారంలోకి రాగానే బదిలీలు, పదోన్నతులు కల్పించామని తెలిపారు. గతంలో దేశంలో విద్యారంగంలో 35వ స్థానంలో ఉన్న తెలంగాణ గతనెలలో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్‌‌లో 18వ స్థానానికి వచ్చిందన్నారు. తెలంగాణను దేశంలోనే 1, 2వ స్థానంలో నిలపాలని టీచర్లకు సూచించారు. 

ఏ‌‌ఐ ఎంట్రీతో అమెరికా నుంచి మనవాళ్లు వెనక్కి వస్తున్నారని, ఇప్పడు సాంకేతిక నైపుణ్యం ఉన్న బ్లూకాలర్​ జాబ్‌‌లకే డిమాండ్​ఉన్నదని చెప్పారు. జర్మన్​, జపాన్​, సౌత్​ కొరియా భాషలు నేర్చుకుంటే ఆ దేశాల్లో అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని, పిల్లలకు ఆయా భాషలు నేర్పించాలని సూచించారు. విదేశాల్లో విద్యా ప్రమాణాలను స్టడీ చేసేందుకు 50 మంది టీచర్లను విదేశాలకు పంపామని, ఈ సారి మరో 150 మందిని సింగపూర్​, సౌత్​కొరియా, ఫిన్లాండ్​ దేశాలకు పంపుతున్నట్టు చెప్పారు. 

ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేశ్​రెడ్డి, వీర్లపల్లి శంకర్​, బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, కార్పొరేషన్​ చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం కానాయపల్లిలో ఉన్న అలంపూర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్​రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఈవీ వెహికల్స్‌‌ వాడకం పెంచుతం..

-పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వెహికల్స్​ వాడకం పెంచాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేసిన అమరరాజా గిగా కారిడార్‌‌‌‌లో  కస్టమర్​ క్వాలిఫికేషన్​ ప్లాంట్​ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌‌ మాట్లాడారు.  వాతావరణ మార్పుల వల్ల సీజన్​ మొదలైనా వర్షాలు పడడం లేదని, ఈ పరిస్థితిని అధిగమించడానికి వెహికల్​ పొల్యూషన్​ను నియంత్రించాలన్నారు. ఈవీ వెహికల్స్‌‌లో ఈవీ బ్యాటరీల పాత్ర కీలకమని, 32 గిగా బైట్​ కెపాసిటీతో ఈ బ్యాటరీల ఉత్పత్తిని అమరరాజా సంస్థ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 

ఇక్కడ 700 మందికి ఉద్యోగాలు కల్పించారని, ఇందులో 400 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఇది విమెన్‌‌ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌కు నిదర్శనమన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని తమ ప్రభుత్వ లక్ష్యం దిశగా అమరరాజా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధిపత్యాన్ని సాధించిందని, ప్రపంచంలో ఎంత పెద్ద దేశమైన ఈవీ బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడాల్సి ఉందన్నారు. అలాంటి దేశం నుంచి అమరరాజా సంస్థ స్ఫూర్తి పొంది, ఆ దేశాలతోనే పోటీ పడుతోందని చెప్పారు.‘‘గల్లా జయదేవ్‌‌కు చిన్న విన్నపం. 

ఇక్కడ మొదటితరం కార్మికులుగా పని చేసిన వారి పిల్లలు ఇంజనీర్లు అయి.. ప్రస్తుతం విదేశాల్లో రాణిస్తున్నారు. మీ పరిశ్రమ స్థాపనకు ఈ పాలమూరు జిల్లాలో రైతుల భూములు ఇచ్చారు. ఈ ప్రాంత యువతకే వీలైనంత వరకు ఉద్యోగాలు ఇవ్వండి. ఈ జిల్లా ప్రజలకు కష్టపడే తత్వం ఉంది. మీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తరు. వారికి చాన్స్‌‌ ఇవ్వాలని గల్లా జయదేవ్‌‌ను కోరుతున్నా” అని అన్నారు. 

డిండి, పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐకి పూర్తి అనుమతులు తెస్తం

ఇరిగేషన్‌‌లో రాణించాలంటే కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐ), కోయిల్‌‌ సాగర్​, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్​ పూర్తి చేసుకోవాలని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. వీటికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పక్క రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐకి సంబం ధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ​ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో రైతులకు శుభవార్త చెబుతామన్నారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. 

డిండి, పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐకి సంపూర్ణమైన అనుమతులు తెస్తామన్నారు. ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చి.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డగా.. ఈ జిల్లాను పూర్తిగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.