హార్వర్డ్‌‌‌‌ లో సీఎం రేవంత్ రెడ్డి ‌‌‌‌

హార్వర్డ్‌‌‌‌ లో  సీఎం రేవంత్ రెడ్డి ‌‌‌‌
  •     కెనెడీ స్కూల్‌‌‌‌లో ప్రారంభమైన ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కోర్సు

హైదరాబాద్, వెలుగు: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రఖ్యాత హార్వర్డ్‌‌‌‌ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్‌‌‌‌లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కోర్సుకు హాజరయ్యారు. తొలిరోజు పరిచయ కార్యక్రమంతో పాటు ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ కోర్సులో భాగంగా ‘అధికార విశ్లేషణ.. నాయకత్వం’ అనే అంశంపై నిర్వహించిన మొదటి సెషన్‌‌‌‌లో ఆయన పాల్గొన్నారు. 

ఇక సోమవారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఈ తరగతులు కొనసాగాయి. ఇందులో ప్రధానంగా కేస్‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ వర్క్‌‌‌‌ వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. మరోవైపు బోస్టన్‌‌‌‌ ప్రాంతంలో తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.