​మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపించాలి: రేవంత్ రెడ్డి

​మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపించాలి: రేవంత్ రెడ్డి

దేశంలోనే తెలంగాణ మోడల్ పాలన బాగుందం టూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పొగడడం గర్వకారణమని సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నా రు. రాష్ట్రంలో మెజారిటీ లోక్​సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​కు ప్రజల్లో మంచి స్పందన ఉందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. శుక్రవారం గాంధీభవన్​లో కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘‘పార్టీలో కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇప్పటికే కొందరికి నామినేటెడ్​ పదవులు ఇచ్చాం. అనుబంధ సంఘాల చైర్మన్లకూ పదవులు ఇచ్చాం. ఇంటికే సమాచారం పంపించాం. రాజ్యస భ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటె డ్ పోస్టుల్లో పదవులు పొందిన వారికి అభినందనలు. ఏప్రిల్ 6న సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్​గాంధీ ప్రాంగణంలో జనజాతర సభను నిర్వహిస్తాం.

ఏఐసీసీ మేనిఫెస్టోలో ఉన్న పాంచ్ న్యాయ్ గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్రంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్​లో ఉన్న అంశాలనూ మేనిఫెస్టోలో పెట్టా లి. దీనిపై మంత్రి శ్రీధర్​బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి సలహాలివ్వండి. వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్​చార్జులను నియమిం చి ప్రచార కార్యక్రమాలు చేపట్టండి’’ అని ఆయన పార్టీ నేతలకు సూచించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ పాలనపై ప్రజ ల్లో ఉన్న స్పందనను లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రచారాని కి వాడుకోవాలని పీఈసీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పీసీసీ  ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితరులు మాట్లాడారు.