చేనేతకు పూర్వవైభవం తేవాలి..కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు సీఎం రేవంత్ సూచన

చేనేతకు పూర్వవైభవం తేవాలి..కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు సీఎం రేవంత్ సూచన

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడం, కార్మికుల సంక్షేమంపై సీఎం దిశానిర్దేశం చేశారు. నేతన్నలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పవర్‌‌లూమ్ (ఆటోమేటిక్ మగ్గాలు) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చైర్మన్ వివరించారు.

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాల (ఐకేపీ) సభ్యులకు ప్రభుత్వ పరంగా పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల ఆర్డర్లను పూర్తిగా స్థానిక చేనేత, పవర్‌‌లూమ్ కార్మికులకే కేటాయించినట్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో సిరిసిల్ల, పోచంపల్లి వంటి ప్రాంతాల కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని సీఎం దృష్టికి వెంకటరమణ తీసుకెళ్లారు.