Summer Food:డోంట్ మిస్..అలసంద వడలు..చల్లగా ఉంటుంది..అలసట.. నీరసం అస్సలు ఉండదు..

Summer Food:డోంట్ మిస్..అలసంద వడలు..చల్లగా ఉంటుంది..అలసట.. నీరసం అస్సలు ఉండదు..

మండే ఎండలతో జనాలు అల్లాడిపోతున్నారు.  ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వస్తే నిప్పుల కుంపటి.. హెవీ బాడీ టెంపరేచర్​ తో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఎండకు  ఏం తినాలనిపించదు... తినకపోతే నీరసం.. అలసట.. వేధిస్తాయి..

 తిన్నా.. తినకపోయినా చిరాకు మాత్రం కామన్​.. ఇలాంటి సమయాల్లో అలసంద వడలు తింటే  క్షణాల వ్యవధిలోనే చిరాకు అలసట పోతాయి.  అంతే కాదు బాడీని చాలా కూల్ గా ఉంచుతాయి.   సమ్మర్​ సీజన్ లో  బ్రేక్​ ఫాస్ట్​ లో తింటే రోజంతా హాయిగా.. నీరసం  అలసట లేకుండా ఉంటారు.  పైగా రుచి అదిరిపోద్ది..ఈ వడలు ఎలా తయారు చేయాలి.. తయారీకి ఏమేమి పదార్దాలు కావాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.  రోజు రోజుకు ఎండలు  పెరుగుతున్నాయి.  ఎండాకాలంలో పొద్దున్నే అలసంద వడలు తింటే హాయిగా.. అలసట.. నీరసం లేకుండా చల్లగా ఉంటుంది. తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి.

అలసంద వడలు తయారీకి కావాల్సినవి 

  • అలసందలు :   ఒక కప్పు  
  • ఉల్లిపాయలు  :  మూడు కప్పులు (సన్నగా తరిగినవి)
  • పచ్చిమిర్చి : 50 గ్రాములు ( తరిగినవి) 
  • అల్లం పేస్ట్ : ఒక  టేబుల్ స్పూన్  
  • కరివేపాకు : 15 రెమ్ములు 
  • కొత్తిమీర : సరిపడ
  • జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా 
  • నూనె : వేయించడానికి సరిపడ

అలసందల వడల తయారీ విధానం 

 అలసందలు  ఎనిమిది గంటలు నీళ్లలో బాగానానబెట్టుకోవాలి. నానిన అలసందలను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో వేసి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  కొద్దిగా నీళ్ళు పోసి రెండో సారి కూడా మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు.  గారెల పిండి మాదిరిగా ఉండాలి. మొదటి సారి నీళ్లు పోయకూడదు.  అలా చేస్తే అలసంద గింజలు పేస్ట్​ కావు. 

 తరువాత గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్​, కరివేపాకు కలపాలి. తరువాత జిలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా మిక్స్​ అయ్యే అయ్యేలా కలపాలి. 

►ALSO READ | ప్రతిరోజూ మామిడి పండు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఇప్పుడు స్టవ్​ వెలిగించి నూనెను కళాయిలో వేడి చేయాలి.   ఇప్పుడు చేతికి ఆయిల్​ రాసుకొని గ్రైండ్​ చేసిన అలసంద పిండిని చిన్న చిన్న వడలుగా చేసి సన్నని మంటపై వేగించాలి.  గోల్ట్​ కలర్​ లోకి మారే వరకు బాగా వేయించాలి. ఇలా చేస్తే ఇవి బాగా టేస్టీగా కరకరలాడుతుంటాయి.  

ఈ వేడి వడలను కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది. పైన తెలిపిన కొలతల ప్రకారం అలసంద వడలను తయారు చేసుకొని తింటే టేస్ట్​ అదిరిపోద్ది..  మరిఇంకెందుకు ఆలస్యం.. ఈ సమ్మర్​ సీజన్​ లో ఇలాంటి బలమైన ఫుడ్​డోంట్​ మిస్​....