హైదరాబాద్ లో రెచ్చిపోతున్న యూత్... రీల్స్ కోసం రోడ్లపై బైక్ స్టంట్లు.. రంగంలోకి పోలీసులు..

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న యూత్... రీల్స్ కోసం రోడ్లపై బైక్ స్టంట్లు.. రంగంలోకి పోలీసులు..

యూత్ లో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సోషల్ మీడియాలో లైకుల కోసం వెకిలి చేష్టలు చేసేవారు కొంతమంది అయితే... రీల్స్ పిచ్చితో ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో యువత రెచ్చిపోతున్నారు. రీల్స్ కోసం రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ కలకలం రేపుతున్నారు. సోషల్ మీడియాలో లైకులు కోసం ప్రమాదకర విన్యాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ( మే 26 ) బైక్ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇటీవల ప్రమాదకరమైన విన్యాసాలతో బైక్ స్టంట్స్ చేసిన బంజారాహిల్స్ కి చెందిన షాదాబ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రోడ్ల మీద కొంతమంది చేస్తున్న వీలింగ్‌లతో భయాందోళనకు గురువుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు యువకులు.

రోడ్ల మీద యువత చేస్తున్న స్టంట్స్ ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పిల్లల బైక్ స్టంట్స్ పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.