
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో భాగంగా కొన్ని విషయాలను పంచుకున్నారు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని భట్టి చెప్పారని సీఎం తెలిపారు. సబితక్క కోసం ప్రచారానికి పోతే తన మీద కేసులయ్యాయని సీఎం గుర్తుచేసుకున్నారు. అక్కల మాటలు నమ్మి నేను మోసపోయానని కేటీఆర్కు చెప్పానని, వాళ్ళ పేర్లు చెప్పలేదుగా అని ఆయన అడిగారు. తనను కాంగ్రెస్లోకి రమ్మని చెప్పిన సబిత అక్క తనకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారిందని, తాను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంట్ భాష లేదని, తాము అసెంబ్లీని డెమోక్రటిక్గా నడుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా చాలా విషయాలను సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
Also Read :- కమీషన్లకోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
సీఎం రేవంత్ చిట్చాట్ విశేషాలు:
* సభలో చాలా టైం ఇచ్చినా... అవకాశం ఇవ్వలేదు అంటున్నారు..
* సబితక్కకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాము..
* అక్క వ్యక్తిగతంగా మాట్లాడినందుకే, నేను మిగతాది పూర్తి చేసిన..
* కేసీఆర్, హరీష్ ఎందుకు డుమ్మాకొట్టారు...
* సబితక్క ఇంత ఆవేదన చెందితే కేసీఆర్, హరీష్ రావులు సభలోకి రావాలిగా, మాట్లాడాలి గా....
* కేటీఆర్, హరీష్ రావులు మేమే చాలు అన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ను తీసేయ్యండి..
* అసెంబ్లీలో ఇంత చర్చ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు...
* నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నాను.. కానీ ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ డెమొక్రసీగా నడుస్తోంది..
* కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది..
* సభలో సస్పెన్షన్ ఉండొద్దు అని మా ఆలోచన
* అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు..
* గతంలో కోమటి రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారుగా..
* దేనికైనా సమయం సందర్భాన్ని బట్టి ఉంటుంది..
* మేము ఇంకా మార్షల్స్ను కూడా వాడటం లేదు..
* ఈ మధ్యలో నాతో కలిసి 10 నుంచి 12 మంది బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు టీ తాగారు..
* కలవడం, టీ తాగడం అనేది రాజకీయాలకు సంబంధం లేదు..
* పొత్తులో ఎంతో మంది సీట్లు కోల్పోయారు.. అందులో భాగంగానే సబితక్క కొడుకుకు టికెట్ రాకపోవచ్చు..