
హైదరాబాద్: పదేళ్లు బీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పు 70వేల కోట్లు మాత్రమే ఉంది.. పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో 7లక్షల కోట్లకు అప్పులు చేశారు. కేవలం కమీషన్లకోసమే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని..చేసిన అప్పును ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇచ్చిన మాటన ప్రకారం రెండు విడుతల్లో రుణమాఫీ చేశాం.. ఆగస్టు 15 వరకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు వివేక్ వెంకటస్వామి.
గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంస్కరణలే దేశాభివృద్దికి తోడ్పడుతున్నాయన్నారు వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్టాడుతూ.. 1992 లో దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టిందన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించిందన్నారు వివేక్ వెంకటస్వామి.
సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అదేవిధంగా రాహుల్ గాంధీ వరంగల్ లో ఇచ్చిన మాట ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే రుణమాఫీ చేస్తుందన్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్షా 50 వేలలోపు రుణమాఫీ చేశామన్నారు. ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రుణమాఫీ అంటూ రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు వివేక్ వెంకటస్వామి. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కార్యక్రమం ఇంప్లిమెంట్ కోసం రైతులనుంచి సలహాలు తీసుకుంటుందన్నారు. రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు వేస్తుందన్నారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుం టుంద న్నారు. రైతుకూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫజల్ బీమాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిందదన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో వైద్యం కోసం భార్యల మీద పుస్తెలు అమ్ముకో వాల్సి వచ్చిందన్నారు వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేసిందన్నారు.