కేటీఆర్ లక్ష కోట్ల దోపిడీలో.. ఒక లక్ష కక్కించాం : సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ లక్ష కోట్ల దోపిడీలో.. ఒక లక్ష కక్కించాం : సీఎం రేవంత్ రెడ్డి


బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.  ఓ మహిళకు కేటీఆర్ సహకారం అందించడం సంతోషకరమని చెప్పిన సీఎం..  కేటీఆర్ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష  రూపాయలు సహాయం చేసేలా చేశామన్నారు.  త్వరలో కూడా మరిన్నీ కూడా కక్కించే పరిస్థితి తీసుకువస్తామన్నారు.

ప్రజావాణిపై  బావ, బామ్మర్దిలు అప్పుడే గాయ్ గాయ్ అంటున్నారని.. ప్రభుత్వం వచ్చి నెల రోజులు మాత్రమే అయ్యిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా పాలన కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఆయా శాఖల ద్వారా అన్నీ పరిష్కరిస్తామని.. ప్రజా వాణికి వచ్చిన ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయల సాయం చేయటం చూస్తుంటేనే.. మా ప్రజా వాణి విజయవంతం అయ్యిందనటానికి నిదర్శనం అన్నారు రేవంత్ రెడ్డి. 

అధికారంలో ఉండగా కేటీఆర్ లక్ష కోట్ల రూపాయలను అవినీతిగా.. అక్రమంగా సంపాదించారని.. అందులో లక్ష రూపాయలు కక్కించామని.. రాబోయే రోజుల్లో మిగతా సొమ్ము మొత్తం కక్కిస్తామని.. ఆ పరిస్థితులు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ బావ బామర్థులు ఆరాటమే కనిపించిదని..  మేం అసెంబ్లీలో వాస్తవాలు చెప్పామన్నారు.  తెలంగాణ  సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అభయహస్తం లోగోను  ఆయన అవిష్కరించారు .

ప్రజావాణి వందకు వంద శాతం పూర్తి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు.   సైనిక్ స్కూల్ ఎందుకు ఆగిందో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలన్నారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు.  మూడోసారి సీఎం అయ్యాక వాటిని వాడాలని అనుకున్నారని తెలిపారు.  ఒక్కో ల్యాండ్ క్రూజర్ ధర రూ.  3 కోట్లు ఉంటుందన్నారు.  

ఇక TSPSC ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు.  ఉద్యోగ నియామకాలు జరగాలంటే TSPSC కు చైర్మన్ ఉండాలన్నారు. TSPSC లో  సభ్యుల రాజీనామాపై గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  గత ప్రభుత్వం ఖాజానా ఖాళీ చేసిందని ఆరోపించారు.