వాళ్లిద్దరు కేసీఆర్ స్కూల్లో చేరగానే మారిపోయారు: సీఎం రేవంత్

వాళ్లిద్దరు కేసీఆర్ స్కూల్లో చేరగానే మారిపోయారు: సీఎం రేవంత్

మాజీ మంత్రులు సబిత, కడియంపై అసెంబ్లీలో సెటైర్లు వేశారు CM రేవంత్ రెడ్డి. BRS లో చేరకముందు వాళ్లు బానే ఉన్నారని.... ఆ స్కూల్లో చేరగానే మారిపోయారని చెప్పారు. గతంలో చేవెళ్ల వరకు ప్రాణహిత నీటి కోసం మాజీమంత్రి సబిత ధర్నాలు చేశారని గుర్తు చేశారు. తమ్ముళ్లు తప్పుచేస్తే సరిదిద్దాల్సిన సబితక్క... సైలెంట్ గా ఉంటున్నారని చెప్పారు. అటు కడియం కూడా BRS లో చేరగానే ఆయన కూడా మారారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

దాచుకోవడం... దోచుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన తప్పులను ఒప్పుకోకుండా... సమర్థించుకోవడం ఏంటన్నారు.   మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం నిరుపయోగమని నిపుణులు చెప్పారని గుర్తు చేశారు సీఎం.  తుమ్మడిహట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టాలని కమిటీ సూచించినా.. కేసీఆర్ వినకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన  ఐదుగురు నిపుణుల కమిటీ రిపోర్ట్ ను   తొక్కిపెట్టారని విమర్శించారు. 38 వేల 500 కోట్ల రూపాయల ప్రాజెక్టును లక్షా 47 వేలకు అంచనాలు పెంచారని విమర్శించారు సీఎం రేవంత్.