ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరస్తున్న ఫుడ్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల అఖిల భారత పుట్ బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న సౌమ్య.. మంగళవారం (సెప్టెంబర్ 23) సీఎంను ఆయన నివాసంలో కలిశారు. 

ఈ సందర్భంగా సౌమ్యను అభినందించారు సీఎం రేవంత్. మరింత ఉత్సాహంతో ఆడాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుందని.. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 

ప్రభుత్వం క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఆడాలని సౌమ్యకు సూచించారు. 

►ALSO READ | నల్గొండ కాంగ్రెస్ అడ్డా..జగదీశ్ రెడ్డి మళ్లీ గెల్వడు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  శివసేనా రెడ్డి , స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు డా.మోహమ్మద్ అలీ రఫాత్, ప్రధాన కార్యదర్శి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు.