నల్గొండ కాంగ్రెస్ అడ్డా..జగదీశ్ రెడ్డి మళ్లీ గెల్వడు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ కాంగ్రెస్ అడ్డా..జగదీశ్ రెడ్డి మళ్లీ గెల్వడు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్  పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావా అని అన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..  నల్గొండ జిల్లాలో  ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక మళ్ళీ గెలవడని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్ వేశారు. 

నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలం అని చెప్పారు.  30 ఏళ్లుగా తనను అక్కున చేరుకున్న కార్యకర్తలకు  ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేనన్నారు.  ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు.   గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తా .. విద్యా,వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వంద శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

►ALSO READ | మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తుంది..కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా?..సిరిసిల్ల కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం