బండి భగీరథ్ ను పోలీసులే అరెస్ట్ చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

బండి భగీరథ్ ను పోలీసులే అరెస్ట్ చేశారు : సీఎం రేవంత్  రెడ్డి

పోక్సో కేసులో ప్రభుత్వం చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి..  బండి భగీరథ్ ను పోలీసులే అరెస్ట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. బండి భగీరథ్ ను సిటీలో అప్పా జంక్షన్ లో రోడ్డుపై కారును  ఆపి అరెస్ట్ చేశారన్నారు. బండి సంజయ్ స్వయంగా అప్పగించారు అని వస్తున్న వార్తలపై స్పందించినసీఎం..ఇంట్లో అప్పగిస్తే అప్పగింత అవుతుందన్నారు సీఎం. నడిరోడ్డుపై పోలీసులు భగీరథ్ ను అరెస్టు చేశారని స్పష్టం చేశారు.  బండి భగీరథ్ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 

ప్రతిపక్షాలు  మైనర్ ఇస్యూను రాజకీయం చేశాయంటూ మండిపడ్డారు సీఎంరేవంత్ రెడ్డి.  కేటీఆర్ అంటోడు మనిషేనా.. రాజకీయాలు చేయాలంటే నన్ను ఓడించు.. మైనర్ ఇష్యూని రాజకీయం చేస్తారాఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి ఏజ్ ని కేటీఆర్ నిర్దారిస్తారా..అమ్మాయి మైనర్ అని సర్టిఫికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నారు. మైనర్ విషయంలో రాద్దాంతం చేస్తున్న కేటీఆర్ సొంత బామ్మర్దే డ్రగ్స్ తీసుకుంటే..అనాడు ఎందుకు పోలీసులకు అప్పగించలేదని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫాం హౌజ్ లో పోలీసులపై కాల్పులు జరిపారు..ఎందుకు ఆ వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు.. చట్టంపై గౌరవం ఉంటే పోలీసులకు ఎందుకు అప్పగించలేదు అని ప్రశ్నించారు.