తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరాం : భట్టి విక్రమార్క

తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరాం : భట్టి విక్రమార్క

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా నివాసానికి వెళ్లారు.

ఉదయం రాహుల్ యాత్రలో పాల్గొన్న నేతలు.. సాయంత్రం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా ను కోరారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును సోనియా గాంధీకి వివరించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నామన్నదానిపై సోనియాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సోనియా గాంధీని కలిశాం.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సోనియాగాంధీని కోరామన్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను సోనియాగాంధీకి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో మంచి ఫలితాలనిస్తుందని.. గడిచిన రెండు నెలల్లో 15కోట్ల జీరో టికెట్లు రికార్డ్ అయినట్లు సోనియా గాంధీ వివరించారు త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,రూ. 500 కే గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ అమలు చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో మొదటిసారి రూపొందిస్తున్న హెల్త్ ప్రొఫైల్ గురించి సోనియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలుతీరును హర్షి్స్తూ అభినందిం చారు సోనియాగాంధీ.