కల్వకుంట్ల గడీలు బద్దలు కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలే: సీఎం రేవంత్

కల్వకుంట్ల గడీలు బద్దలు కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలే: సీఎం రేవంత్

హైదరాబాద్: కల్వకుంట్ల కోటల బద్దలు కొట్టింది కాంగ్రెస్ కార్యకర్తలేనని.. కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (జూలై 4) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభకు హాజరై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇదే ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని గుర్తు చేశారు. మా ప్రభుత్వం మాణాళ్ల ముచ్చేటనని అన్నారు.

సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు అమలు చేయలేరని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు కలిసి ఉండలేరని.. వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారని ప్రచారం చేశారు. కానీ నవ్వినోడి ముందే తలెత్తుకునేలా పాలన చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కుల గణన చేసి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగుతున్నామని.. కలిసి కట్టుగా ముందుకెళ్తూ అందరి అపోహలు పటాపంచలు చేశామన్నారు. 

ALSO READ | తెలంగాణలో విజయం కార్యకర్తల కష్టమే.. అసాధ్యం అనుకుంటే సుసాధ్యం చేశారు: ఖర్గే

తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగిన బీఆర్ఎస్‎ను దెబ్బకొట్టామన్నారు. మూడు రంగుల జెండా పట్టి రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందిని చైతన్య పరిచామని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ చేశామని గుర్తు చేశారు. ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కష్టాలు.. ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.