V6 News

హైదరాబాద్ లో వంద స్టార్టప్స్ ఏర్పాటే లక్ష్యం: సీఎం రేవంత్

హైదరాబాద్ లో  వంద స్టార్టప్స్ ఏర్పాటే లక్ష్యం: సీఎం రేవంత్

హైదరాబాద్ లో  వంద స్టార్టప్స్ ఏర్పాటే సర్కార్ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు .గడిచిన 25 ఏళ్లలో ఎన్నో స్టార్టప్ లు వచ్చాయన్నారు సీఎం. ఇన్నోవేషన్ స్టార్టప్స్ పై  మరింత ఫోకస్ చేశామని చెప్పారు.   తెలంగాణ స్టార్టప్స్ తో గూగుల్ భాగస్వామ్యం ఉందన్నారు. 

ఇన్నోవేషన్ స్టార్టప్స్ పై  మరింత ఫోకస్ : శ్రీధర్ బాబు

 రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను మరింత ప్రోత్సహిస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు.  విజన్ 2047 టార్గెట్ ప్రభుత్వం పనిచేస్తందన్నారు. స్టార్టప్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.యూనికార్న్ లను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ  స్టార్టప్ లకు గూగుల్ మెంటార్ గా ఉండటం చాలా సంతోషమన్నారు.