రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవానికి సీఎంకు ఆహ్వానం : తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు

రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవానికి సీఎంకు ఆహ్వానం : తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి, కార్యదర్శి  కందిమళ్ల ప్రతాప్​రెడ్డి, సభ్యులు రావి భారతి, కె. శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లేఖను అందజేశారు. 

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును ఈ ఏడాది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించిందని ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. రావి నారాయణ రెడ్డి పోరాట స్ఫూర్తిని తరతరాలు స్మరించుకునేలా ఆయన విగ్రహాన్ని ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేయాలని, ఎల్బీనగర్ (కొత్తపేట)లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ ఆస్పత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని కందిమల్ల ప్రతాప్ రెడ్డి సీఎంకు  విజ్ఞప్తి చేశారు.