గ్లోబల్ సదస్సుకు రండి..చుక్కా రామయ్యకు సీఎం ఆహ్వానం

గ్లోబల్ సదస్సుకు రండి..చుక్కా రామయ్యకు సీఎం ఆహ్వానం

అంబర్​పేట్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్  గ్లోబల్  సమిట్’​ కు రావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్​రెడ్డి ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్  ఆదివారం రాత్రి నల్లకుంటలోని రామయ్య నివాసానికి వెళ్లి సీఎం రేవంత్  రెడ్డి పంపిన ఇన్విటేషన్  కార్డును ఆయనకు అందజేశారు. 

సీఎం రాసిన లేఖలో “తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతను ఈ సమిట్‌‌‌‌‌‌‌‌లో  ఆవిష్కరిస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని ఎదురుచూస్తున్నాను. భవిష్యత్తు కోసం ఈ దార్శనికతను నిజం చేయడంలో మీ మద్దతు, భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం” అనిపేర్కొన్నారు.