చలికాలంలో కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. ఉదయాన్నే మోకాళ్లు బిగుతుగా ఉండటం, చల్లని రాత్రిలో భుజాల నొప్పి, పనిచేస్తున్నప్పుడు వేళ్లు, మోకాళ్లు లాక్ అయినట్లు అనిపించడం, ఇక అర్థరైటిస్ సమస్య ఉన్న వారికి మరింత నొప్పిగా ఉండటం జరుగుతుంది. మరీ కీళ్లను కాపాడుకోవాలన్నా, కీళ్ల నొప్పులనుంచి విముక్తి పొందాలన్నా ఏంచేయాలి?
చలికాలంలో ఎక్కువగా ఇంటి లోపలే ఉంటారు. ఇది సూర్యరశ్మిని, శరీర కదలికను తగ్గిస్తుంది. చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కీళ్లను వంగకుండా గట్టగా మారుస్తుంది. తక్కువ ఎండకు గురికావడం వల్ల విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కీళ్ల , ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కీళ్ల నొప్పులను పెంచుతాయి. మన దేశంలో మిడిల్ ఏజ్, ఓల్డే్జ్ పీపుల్స్ లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి.
చలికాలంలో కీళ్ల నొప్పుల నివారణకు చిట్కాలు..
వ్యాయామం..బలమైన కండరాలు కీళ్లకు మంచి సపోర్టు నిస్తాయి. కాబట్టి భుజం వ్యాయామాలు, ఆసనాలు, కాలి గుత్తులను (చీలమండలం)తిప్పడం, లెగ్ లిఫ్ట్ లు, వాల్ సిట్ వంటి లైట్ ఎక్సర్ సైజులతో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. వీటిని ప్రతి రోజూ చలికాలం వెళ్లే వరకు చేస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు.
విటమిన్ డి పెంచుకోవడం.. చలికాలంలో సాధారణంగా కావాల్సినంత సూర్యకాంతి లభించదు. కాబట్టి విటమిన్ డి లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. కీళ్ల నొప్పులు ఉన్న చోట గోరు వెచ్చని వాటర్ బ్యాగులు, హీటింగ్ ప్యాడ్ లను ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే చల్లని గాలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కీళ్ల ఆరోగ్యం కోసం మంచి ఆహారం.. చలికాలంలో మీ వంటకాల్లో అల్లం, నల్ల మిరియాలు, వెచ్చన ద్రవాలు, పప్పులు, పసుపు, నెయ్యి జోడించాలి.వెచ్చని సూప్ లు తాగొచ్చు. పసుపుపాలు తాగితే ఇంకా మంచిది. ప్రాసెస్ చేసిన స్నాక్స్, వేయించిన ఆహారం , కూల్ డ్రింక్స్, కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మానేస్తే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
యాక్టివ్ గా ఉండండి.. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడం ద్వారా కీళ్లు లూబ్రీకేట్ గా, ఆరోగ్యంగా ఉంటాయి. యోగా, ఇండోర్ వర్కవుట్స్,బ్రిస్క్ వాకింగ్, లైట్ స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలతో శరీరాన్ని యాక్టివ్ గా ఉండేలా చేసుకోవచ్చు.
మంచి నిద్రతో.. వెచ్చని గదిలో తలకింద దిండుతో 7నుంచి 8 గంటలు నిద్రపోతే చలికాలంలో కలిగే మంట, కీళ్ల నొప్పిని కొంతవరకు నివారించొచ్చంటున్నారు.
హెల్దీ వెయిట్.. అధిక బరువు తొంటి, మోకాలు వంటి శరీర బరువును మోసే కీళ్లపై ఒత్తిడిని పెంచుతాయి. చలికాలంలో బరువును మెయింటెన్ చేయడం ద్వారా కూడా కొంతవరకు కీళ్ల నొప్పులను నివారించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
