ఫిజిక్స్ వాలా లైఫ్
- టైటిల్ : హలో బచ్చోన్
- ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
- డైరెక్షన్ : ప్రతీష్ మెహ్రా
- కాస్ట్ : వినీత్ కుమార్ సింగ్, విక్రమ్ కొచ్చర్, గిరిజా ఓక్
ఎడ్-టెక్ కంపెనీ ‘ఫిజిక్స్ వాలా’ ఫౌండర్ అలఖ్ పాండే జీవితం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తీశారు. అలఖ్ పాండే (వినీత్ కుమార్ సింగ్) ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఫిజిక్స్ టీచర్. అతను చిన్నప్పుడు స్లమ్‌లో పెరుగుతాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ట్యూషన్లు చెప్తూనే ఆన్‌లైన్ ఎడ్‌టెక్ రంగంలో రివల్యూషన్ తీసుకురావాలని కలలు కంటాడు.
ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని ప్రతి ఒక్కరికీ అఫర్డబుల్ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో యూట్యూబ్‌లో ‘ఫిజిక్స్ వాలా’ చానెల్ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్తాడు. కొన్నాళ్లకు కంపెనీ స్థాపించి సేవలు అందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
మలిసంధ్యలో విడాకులు!
- టైటిల్ : జబ్ ఖులీ కితాబ్
- ప్లాట్ ఫాం : జీ5
- డైరెక్షన్ : సౌరభ్ శుక్లా
- కాస్ట్ : డింపుల్ కపాడియా, పంకజ్ కపూర్, అపర్‌శక్తి ఖురానా, మానసీ పరేఖ్, సమీర్ సోనీ, నౌహీద్ సైరూసి
గోపాల్ చంద్ర నౌతియాల్ ( పంకజ్ కపూర్ ) రిటైర్డ్ ఇంజినీర్. భార్య అనసూయ(డింపుల్ కపాడియా) రెండేండ్ల పాటు కోమాలో ఉండి, అకస్మాత్తుగా మేల్కొంటుంది. అప్పుడే 48 ఏండ్ల క్రితం అంటే తన పెళ్లి జరిగిన నాలుగో నెలలో తనకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉండేదని చెప్తుంది. అతని వల్లే తనకు పెద్ద కొడుకు పరమ్ (సమీర్ సోని) పుట్టాడని నిజాయితీగా ఒప్పుకుంటుంది.
అది విని గోపాల్ చాలా బాధపడతాడు. కోపంతో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుని కోర్టుకి వెళ్తాడు. లాయర్ ఆర్‌కే నేగి (అపర్‌శక్తి ఖురానా) సాయం తీసుకుంటాడు. అప్పటివరకు పర్ఫెక్ట్ కపుల్‌గా కనిపించిన వాళ్లు విడాకులకు అప్లై చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సిరీస్ చూడాలి.
సరదాగా సాగే లైఫ్‌లో..
- టైటిల్ : చరిత కామాక్షి
- ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
- డైరెక్షన్ : చందుసాయి
- కాస్ట్ : దివ్య శ్రీపాద, అభయ్ నవీన్, పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సునీత మనోహర్
చరిత (దివ్య శ్రీపాద) ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ప్యాషనేట్ ఫిల్మ్‌మేకర్ చక్రవర్తి (నవీన్ బేతిగంటి)ని పెండ్లి చేసుకుంటుంది. లైఫ్ హాయిగా సాగిపోతుంటుంది. అప్పుడే అనుకోకుండా చక్రవర్తి ఓ కేసులో ఇరుక్కుంటాడు.
ఇన్స్పెక్టర్ (పృథ్వీరాజ్) అతన్ని కేసు నుంచి తప్పించడానికి చరితకు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి? చరిత దానికి ఒప్పుకుందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
