అశ్వారావుపేటలో టీఎస్ యూటీఎఫ్ మహాసభలో విషాదం..గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

అశ్వారావుపేటలో టీఎస్ యూటీఎఫ్ మహాసభలో విషాదం..గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
  • భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఘటన

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి జిల్లాలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ మహాసభ లో విషాదం చోటు చేసు కుంది. ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడు. అశ్వారావుపేట టౌన్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు. సభ లో మండలంలోని దురదపాడు ఎంపీపీఎస్ స్కూల్ ఉపాధ్యాయుడు కట్టా మధు(48) ఛాతిలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు చెప్పి  కుప్పకూలిపోయాడు.  

ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు  మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించారు.  తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే ఉపాధ్యాయుడు మధు చనిపోయాడు. మహాసభను నిలిపివేసి ఉపాధ్యాయులు వెళ్లి పరామర్శించారు. తోటి ఉద్యోగి మృతికి ఉపాధ్యాయ సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.