మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: బీఈడీ కాలేజీ, జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో టెట్ సైకాలజీ ఫ్రీ కోచింగ్ ను బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ గోవింద రాజులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరూ విధిగా టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడవద్దని తమ కాలేజీలో పని చేస్తున్న సైకాలజీ సీనియర్ లెక్చరర్ జనార్దన్ రెడ్డి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్, పూర్వ విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి 70 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, కాలేజీ పూర్వ విద్యార్ధులు కోచింగ్కు హాజరయ్యారు. ఏఎంవో శ్రీనివాస్, కాలేజీ సూపరింటెండెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.
