ఇండియన్ క్రికెటర్ స్మృతి మంధాన సైలెన్స్ బ్రేక్ చేసింది. పెళ్లి విషయంలో వస్తున్న రూమర్స్ పై ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టింది. నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడ్డ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు నడుస్తున్న క్రమంలో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. పలాశ్ తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.
ఆదివారం (డిసెంబర్ 7) పెళ్లికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ స్టేట్ మెంట్ ఇచ్చింది మంధాన. ఈ మ్యాటర్ పై ఇక డిస్కషన్స్ వద్దని.. ఇంతటితో క్లోజ్ కావాలని కోరింది.
గత కొన్ని వారాలుగా నా లైఫ్ కు సంబంధించి ఎన్నో రకాల ఊహాగానాలు, చర్చలు నడిచాయి. నేను చాలా ప్రైవేట్ పర్సన్. చాలా డిజర్వ్డ్ గా ఉంటా. ఏ విషయం అయిన అలానే ఉండాలని కోరుకుంటా. అందులో భాగంగా నా పెళ్లి రద్దయిందని క్లారిటీ ఇస్తున్నా. ఇంతటితో ఈ మ్యాటర్ ఎండ్ అవుతుందని భావిస్తున్నాను.. అంటూ పోస్ట్ చేసింది.
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే, పలాష్, స్మృతి పెళ్లి పోస్ట్‌పోన్ వెనక మరో కారణం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‌తో చేసిన చాట్ లీక్ కావడం వల్లే పెళ్లి క్యాన్సిల్ అయిందని ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై స్మృతి మంధనా, పలాష్ ముచ్చల్ ఎవరూ స్పందించలేదు. ఇంతలోనే స్మృతి మంధనా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లికి సంబంధించిన అన్ని ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో స్మృతి, పలాష్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
