ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలు, ఉపకులాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. వర్గీకరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదన్నారు. లోపాలను వెంటనే సవరించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్కు వినతిపత్రం అందించారు.
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వర్గీకరణ సవరణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని, అదనంగా 2 శాతం రిజర్వేషన్లు పెంచాలని కోరారు. జేఏసీ ప్రతినిధులు మందాల భాస్కర్, చెరుకు రామచందర్, బేర బాలకిషన్, మాదాసు రాహుల్ రావు, బాలకృష్ణ, బత్తుల రమేశ్, దిలీప్, మల్లేశ్, రమేశ్తదితరులు పాల్గొన్నారు.
