- రేపటితో ముగియనున్న ఫస్ట్ విడత ప్రచారం
- ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు
ఆదిలాబాద్/మంచిర్యాల, వెలుగు: పంచాయతీ ఎన్నికల రెండో విడతలో పోటీ చేసే వారు ఖరారయ్యారు. శనివారం విత్‌డ్రాల అనంతరం తుది జాబితాను అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 8 మండలాల్లోని 156 గ్రామపంచాయతీలకు 672 మంది సర్పంచ్అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఇక 1,260 వార్డులకు 2,540 మంది పోటీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 114 సర్పంచ్ స్థానాలకు గత నెల 30 నుంచి ఈ నెల 2 వరకు నామినేషన్లు స్వీకరించగా, మొత్తం 758 నామినేషన్లు వచ్చాయి.
ఈ నెల 6న విత్ డ్రాల సందర్భంగా 238 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈనెల 9న మూడో విడత నామినేషన్లు ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 9న ప్రచారం ముగియనుండగా, 11న ఎన్నికలు జరుగనున్నాయి.
రెండో విడత ఎన్నికల 14న జరగనున్నాయి. వేమనపల్లి మండలం రాజారం సర్పంచ్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో అభ్యర్థులు లేక నామినేషన్ దాఖలు కాలేదు. కన్నెపల్లి మండలం ముత్తాపూర్, కాసిపేట మండలం ధర్మారావుపేట సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్‌జిల్లాలోని 131 గ్రామ పంచాయతీలకు 424 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.
విత్‌డ్రాల అనంతరం రెండో విడత నామినేషన్ల తుది జాబితా
ఆసిఫాబాద్ జిల్లా
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
బెజ్జూర్ 22 83 158 446
చింతలమానెపల్లి 19 67 146 402
దహెగాం 24 76 287 461
కౌటల 20 85 156 461
పెంచికల్ పేట్ 12 49 81 220
సిర్పూర్ (టి) 15 65 109 392
మొత్తం 112 425 837 2,294
ఆదిలాబాద్ జిల్లా..
మండలం పంచాయతీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
ఆదిలాబాద్ 31 122 258 550
మావల 3 22 28 81
బేల 31 113 254 517
జైనథ్ 17 90 144 307
సాత్నాల 17 62 130 232
భోరజ్ 17 94 138 264
తాంసి 14 74 112 213
భీంపూర్ 26 95 196 376
మొత్తం 156 672 1,260 2,540
మంచిర్యాల జిల్లా..
మండలం పంచాయతీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
బెల్లంపల్లి 17 52 156 344
భీమిని 12 38 100 209
కన్నెపల్లి 15 36 130 259
కాసిపేట 22 64 190 349
నెన్నెల 19 55 158 346
తాండూర్ 15 51 144 320
వేమనపల్లి 14 40 118 232
మొత్తం 114 336 996 2,059
