- రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడరూరల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెక్‌పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వాహన తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ ను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి, వాహనాల తనిఖీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
