నిజామాబాద్ జిల్లాలో యూపీ, బిహార్ కూలీలకు ఫుల్ డిమాండ్

నిజామాబాద్ జిల్లాలో యూపీ, బిహార్ కూలీలకు ఫుల్ డిమాండ్

నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ సీజన్​లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలు నాట్లు వేసేందుకు నిజామాబాద్ జిల్లాకు వస్తుంటారు. జిల్లాలోని మోస్రా, చందూర్, వర్ని  ప్రాంతాల్లో వరి నాట్లు ఎక్కువగా వేస్తారు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో కూలీలు వేగంగా నాట్లు వేయడంతో వారికి ఫుల్ డిమాండ్ ఉందని స్థానిక రైతులు తెలిపారు. ఎకరానికి రూ.4 వేల చొప్పున తీసుకుంటున్నారని పేర్కొన్నారు.  - వెలుగు ఫొటోగ్రాఫర్ నిజామాబాద్