సమస్యాత్మక గ్రామాలపై నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 51 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

సమస్యాత్మక గ్రామాలపై నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 51 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
  • జిల్లాలో ప్రతి విడతకు 800 మంది పోలీసులతో బందోబస్తు 

రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 11,14,17 తేదిల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ దృష్టి పెట్టింది. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో ప్రతి విడతకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో నిరంతరం నిఘా ఉండేలా పోలీసులు ప్రణాళిక రెడీ చేశారు. 

ఐదంచెల భద్రత 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల పరిధిలో 260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 51 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించారు. ఈగ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటుచేయడంతోపాటు ఆయా గ్రామాల్లోని రౌడీషీటర్లు, క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిస్టరీ ఉన్నవారిపై నిఘా పెడుతున్నారు.

 మండలం యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకొని ఐదెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మూడు నాలుగు గ్రామాలకు ఒక ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, మండలానికో సీఐ, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్ పని చేస్తోంది. పోలింగ్ కేంద్రాలను ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు నిరంతరం పర్యవేక్షించనున్నారు. 

మద్యం, డబ్బు రవాణాపై నిఘా 

జీపీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఆరు చెక్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. జిల్లెల్ల, మానాల, ఫాజుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెంకట్రావుపల్లి, నర్సింగపురం, పెద్దమ్మ చెక్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా మద్యం, డబ్బు తరలింపుపై నిఘా పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ. 8.75లక్షల నగదు, 406.4 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. 183 కేసులకు సంబంధించి 722 మందిని బైండోవర్ చేశారు.

పటిష్ట చర్యలు తీసుకుంటాం

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మూడు విడతల్లో జరిగే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేసుకుంటున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు కూడా సహకరించాలి.-ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.గీతే, రాజన్నసిరిసిల్ల జిల్లా