Bigg Boss Telugu 9: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేట్.. ఫినాలేకు ముందు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్!

Bigg Boss Telugu 9: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేట్.. ఫినాలేకు ముందు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్!

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ తుది దశకు చేరుకుంది. హౌస్ లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది. కేవలం మరో రెండు వారాల్లో టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రతి వీకెండ్ ఎలిమినేషన్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే, ఈసారి జరిగిన ఎలిమినేషన్ మాత్రం హౌస్‌లో ఉన్నవారితో పాటు బయట ఆడియెన్స్‌ను కూడా తీవ్ర షాక్‌కి గురిచేసింది.

ఎలిమినేషన్ రేసులో ఆరుగురు..

ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్‌లు ఉన్నారు. వారిలో తనూజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి. సాధారణంగా గత రెండు మూడు వారాల ఓటింగ్ సరళిని బట్టి చూస్తే..  సంజన , సుమన్ శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు, వారిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చని అందరూ భావించారు.   తొలుత కమెడియన్ సుమన్ శెట్టినే బయటకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన ఔట్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

సంజనకు కలిసొచ్చిన వివాదం.. 

అయితే, గత వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన ఒక అనూహ్య పరిణామం మొత్తం లెక్కలను మార్చేసింది. రీతూ చౌదరి-పవన్‌ల మధ్య ఉన్న సంబంధంపై సంజన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై హోస్ట్ నాగార్జున జోక్యం చేసుకుని సంజనతో క్షమాపణ చెప్పించాలని చూసినా అది ఫలించలేదు. సంజన తన పాయింట్‌ను బలంగా చెప్పడం ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వారం ఆమెకు ఓటింగ్ అమాంతం పెరిగిపోయి, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి చేరుకుంది.

►ALSO READ | అక్కడ నటించడానికి మొదట్లో భయపడ్డా.. వాళ్లు అలా చూసుకోవడంతో మారిపోయా.. సుహాస్ భామ సినీ విశేషాలు

దీనికి పూర్తి విరుద్ధంగా, సంజనతో జరిగిన ఈ వాగ్వాదం రీతూ చౌదరిపై కొంత నెగిటివిటీని పెంచింది. ముఖ్యంగా, పవన్‌తో ఆమె వ్యవహారం ప్రేక్షకులకు మొహం మొత్తిందనే అభిప్రాయాలు పెరిగాయి. గేమ్స్ పరంగా మంచి పోటీ ఇచ్చినా, ఫినాలే కంటెండర్‌షిప్‌ పోటీల్లో చివరి వరకు వచ్చినా, ఈ అంశాలు ఆమెకు నష్టం కలిగించాయి. ఈ కారణంగానే ఈ వారం ఆమె ఓటింగ్ శాతం తగ్గింది. 

టాప్-5 ఆశలకు గండి!

అనూహ్యంగా, ఊహించని విధంగా, రీతూ చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఆమె టాప్-5 వరకు చేరుకోవడానికి బలమైన పోటీదారుగా ఉంటుందని చాలామంది అంచనా వేశారు. ఈ షాకింగ్ ఎలిమినేషన్‌తో, ఈ సీజన్ టాప్-5 రేసు నుంచి ఆమె నిష్క్రమించింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు కానీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. మొత్తానికి ఈ సీజన్ క్లైమాక్స్‌ను మరింత అనూహ్యంగా మారుస్తుందని చెప్పవచ్చు.