అక్కడ నటించడానికి మొదట్లో భయపడ్డా.. వాళ్లు అలా చూసుకోవడంతో మారిపోయా.. సుహాస్ భామ సినీ విశేషాలు

అక్కడ నటించడానికి మొదట్లో భయపడ్డా.. వాళ్లు అలా చూసుకోవడంతో మారిపోయా.. సుహాస్ భామ సినీ విశేషాలు

కంటెంట్​ నచ్చితే ఏ భాషలో ఉన్నా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సినిమా లవర్స్. నటీనటులు తెలియకపోయినా క్యారెక్టర్స్​తో కనెక్ట్ అవుతారు. అలా ఆడియెన్స్​కు దగ్గరైన కొందరు నటులకు ఇతర భాషల్లోనూ క్రేజ్ ఉంటుంది కాబట్టి అవకాశాలు రావడం కూడా కామన్​. అలాంటి క్రేజ్​ తెచ్చుకుని వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మాయి. ఇండస్ట్రీకి వచ్చిన మూడేండ్లలోనే మూడు భాషల్లో డెబ్యూగా చేయడమేగాక, అన్నింట్లోనూ తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. తను ఎవరంటే.. మాళవిక మనోజ్ (Malavika Manoj)​.

ఈ ఏడాది రిలీజ్ అయిన ‘‘ఓ భామ.. అయ్యో రామ..” సినిమాలో నటించిన మాళవిక, మలయాళంతో మొదలుపెట్టి తమిళంలో ‘జో’ సినిమాతో పాపులర్ అయింది. ఆ సినిమా చూసిన డైరెక్టర్​ తెలుగులో నటించమని అడగ్గా.. కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకుంది. సుహాస్​కు జోడీగా కనిపించిన మాళవిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ‘‘ఆన్ పావమ్ పొల్లతాతు”అనే తమిళ సినిమాలో మరోసారి ‘జో’ ఫేమ్​ రియో రాజ్​తో కలిసి నటించింది. వీళ్లిద్దరి కాంబినేషన్​ రిపీట్​ అవుతుండడంతో ఆడియెన్స్​ కూడా ఎగ్జయిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్​లో ఉంది.

ఈ సందర్భంగా మాళవిక మనోజ్​ జర్నీ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘జో’ సినిమా తర్వాత నుంచి నేను ఎక్కడ కనిపించినా నన్ను ‘సుచి’ అని అందులో నా పాత్ర పేరుతో పిలుస్తున్నారు. ‘జో’ ఓటీటీలో రిలీజ్ అయినా సోషల్ మీడియా వల్ల చాలామంది ఆడియెన్స్​కు రీచ్ అయింది. ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సంబంధించిన కంటెంట్​, సాంగ్స్​తో సోషల్​ మీడియాలో రీల్స్, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామందిఆ రీల్స్​ చూశాకే సినిమాలకు వస్తున్నారు. ఏదయితేనేం.. ‘జో’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

యాక్టింగ్​ విషయానికొస్తే..

సినిమా అనేది టీం వర్క్ అందులో నేను యాక్టర్​గా ఎలా చేస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్​. కాబట్టి నా యాక్టింగ్  విషయానికొస్తే నాకు ఏం చెప్పారో అది నేను చేయాలి. ముందుగా ప్రిపేర్​ అయ్యేవి ఏం ఉండవు. ‘జో’ సినిమాలో నటిస్తున్నప్పుడు చాలా షార్ట్స్​లో నేను, రియో ఉంటాం. మా ఇద్దర్నీ మాట్లాడుకోమనేవాళ్లు. దాన్ని వాళ్లు క్యాప్చర్​ చేస్తాం అని చెప్పారు. ఎక్కువ ప్లానింగ్​ లేకుండా సాగింది. నాకు అది బాగా నచ్చింది.

►ALSO READ | Sasirekha Lyrical: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మీసాల పిల్లను మించేలా చిరు, నయన్ మెలోడీ

మనం ఎవరితో కలిసి నటిస్తున్నామో వాళ్లతో కంఫర్టబుల్​గా ఉండాలి. అంటే టీం అంతా అలాగే ఒకరితో ఒకరు కలుపుగోలుగా ఉండాలి. ఒకవేళ స్క్రిప్ట్​ బాలేకపోతే అవుట్​పుట్ కూడా సరిగా రాదు. కానీ, టీం సరిగా లేకపోతే మనం ఒత్తిడికి గురవుతాం. వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్​ రాదు. 

నా మొదటి సినిమా..

నిజానికి నేను నటినవుతానని అనుకోలేదు. మా అమ్మ వల్ల యాక్టింగ్​లోకి వచ్చా. ‘ప్రకాశన్​ పారక్కట్టె’ సినిమాలో నటించేందుకు మా అమ్మ నా అప్లికేషన్​ పంపింది. నా ఫొటో కూడా పంపినట్లు నాకు అస్సలు తెలియదు. నేను సెలక్ట్​ అయ్యానని, నన్ను రియల్​గా చూడడానికి వాళ్లు మా దగ్గరకు వచ్చినప్పుడే నాకు తెలిసింది. అప్పటికీ నేను టెన్త్​ క్లాస్​ స్టూడెంట్‌‌ని. ప్రతిరోజు షూటింగ్​కి వెళ్లేటప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి జాలీగా స్పెండ్​ చేయడానికి వెళ్తున్నట్టు ఫీలయ్యేదాన్ని. వాళ్లు చెప్పినట్టు చేసి తిరిగి వచ్చేదాన్ని. 

తెలుగులో..

‘జో’ సినిమా చేసేటప్పుడు టీం అంతా ఒక ఫ్యామిలీలా కలిసి వర్క్ చేశాం. ఆ తర్వాత మేం ఎప్పుడు కలిసినా అలాగే ఫీలయ్యేవాళ్లం. ఆ సినిమా ద్వారా నాకు చాలామంది అన్నదమ్ములు దొరికారు. ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూసుకునేవారు. నేను టీంలో ఒక మెంబర్​ని అయినా నన్ను స్పెషల్​ కేరింగ్​తో చూసుకోవడం నా అదృష్టంగా అనిపించింది.

కానీ, తెలుగు సినిమాలో నటించడానికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త వాతావరణం కావడంతో మొదట్లో కాస్త భయపడ్డా. దాంతోపాటు భాష రాదు. కనీసం అవతలి వాళ్లు మాట్లాడేది అర్థం కూడా కాదు. వర్క్​ స్టార్ట్​ అయిన తర్వాత నా భయం పోయింది. టీం అంతా నన్ను బాగా పలకరించేవాళ్లు. సెట్​లో ఉన్న వాళ్లు నన్ను వాళ్ల కూతురిలా చూసుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by V Arts (@vartsfilms)