Sasirekha Lyrical: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మీసాల పిల్లను మించేలా చిరు, నయన్ మెలోడీ

Sasirekha Lyrical: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మీసాల పిల్లను మించేలా చిరు, నయన్ మెలోడీ

‘మన శంకరవరప్రసాద్ గారు’రెండో సాంగ్ వచ్చేసింది. ఆదివారం (డిసెంబర్ 7న) ‘‘శశిరేఖ’’ (Sasirekha) ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. "శంకరవరప్రసాద్" పాత్రలో చిరు.. "శశిరేఖ" పాత్రలో నయనతార పరిస్థితులను సరదాగా వివరించే ఈ పాట ఆకట్టుకుంటోంది.

‘‘శశిరేఖ.. ఓ మాట చెప్పాలి.. చెప్పాక.. ఫీలు కాక’’.. ‘‘ఓ ప్రసాద్.. మొహమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమి కాదు..’’ అంటూ అనంత శ్రీరామ్ క్రేజీ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మెలోడియస్ ట్యూన్ కి భీమ్స్, మధుప్రియ తమదైన శైలిలో పాడారు.

ఇప్పటికే,  "శంకరవరప్రసాద్" నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సాంగ్‌‌ దుమ్మురేపింది. 75 మిలియన్ల+వ్యూస్‌‌ను సాధించి చార్ట్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘శశిరేఖ’ వంతు!! ఇక ఈ పూర్తి పాటను వింటుంటే.. మరో బ్లాక్ బస్టర్ సాంగ్ అన్నట్టుగా అర్ధమైపోతుంది. 

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. హీరో విక్టరీ వెంకటేష్‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.