సోషల్ మీడియాపై నిరంతరం నిఘా

సోషల్ మీడియాపై నిరంతరం నిఘా

లింగంపేట, వెలుగు : సోషల్​మీడియాపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం లింగంపేట పోలీస్ స్టేషన్​లో ఎల్లారెడ్డి సబ్​డివిజన్​పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా వాట్సాప్ గ్రూపుల్లో కులమతాలను కించపర్చేలా ఎవరూ పోస్టులు పెట్టకూడదన్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సీఐలు, ఎస్ఐలు పకడ్బందీగా విధులు నిర్వహించి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని సూచించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్ఐలు పాల్గొన్నారు.