జీపీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి

జీపీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి
  •     కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్ విధానంలో సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పీవోలు(-ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ) 1,255, ఇతర పోలింగ్ అధికారులు 1,773 మందిని కేటాయించినట్లు చెప్పారు. 

ఎన్నికల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఎలక్షన్ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టినట్లు డీపీవో జగదీశ్వర్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు.