చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్ ప్లస్ త్వరలోనే కొత్త OnePlus 15Rను ఇండియాలో లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందే, కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌తో ప్రపంచంలో విడుదలైన మొదటి ఫోన్ ఇదే. ఈ ఫోన్ 8.3mm మందంతో 215 గ్రాముల బరువు ఉంటుంది. నలుపు ఇంకా ఆకుపచ్చ (Green) రంగులలో లభిస్తుంది.
OnePlus 15R లో భారీ 7,400 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. నాలుగు సంవత్సరాలు ఉపయోగించినా కూడా బ్యాటరీ లైఫ్ కనీసం 80% వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీని కోసం సిలికాన్ నానోస్టాక్ టెక్నాలజీని వాడుతున్నారు.
►ALSO READ | వర్చువల్ ట్రయల్స్..ఆన్ లైన్ షాపింగ్.. డ్రస్సుల టెస్టింగ్.. AI బేస్డ్ ఫీచర్.. కస్టమర్ల కష్టాలకు చెక్
డిస్‌ప్లే & కెమెరా: ఈ ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 1,800 నిట్స్ బ్రైట్ నెస్, 4K రిజల్యూషన్ వీడియోలను 120 ఫ్రేమ్‌ల (fps) వద్ద రికార్డ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇంతకుముందు కేవలం ఫ్లాగ్‌షిప్ ఫోన్లలోనే ఉండేది. OnePlus స్వంత 'ప్లస్ మైండ్' (Plus Mind) AI టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
లాంచ్ తేదీ: OnePlus 15R డిసెంబర్ 17న బెంగళూరులో జరిగే లైవ్ ఈవెంట్‌లో OnePlus Pad Go 2తో పాటు విడుదల కానుంది. అయితే దీని ధర ఇంకా ప్రకటించలేదు, కానీ గతంలో రూ. 42,999 కి విడుదలైన OnePlus 13R ధరకి దగ్గరగా ఉండవచ్చని అంచనా.
