షాపింగ్‌కి వెళ్తే ట్రయల్ చేయకుండా కొనడం అంత ఈజీ కాదు. కానీ, ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ నడుస్తోంది. దాంతో ట్రయల్స్ వేయడానికి వీలు లేకుండా పోయింది. కస్టమర్స్ ఈ ప్రాబ్లమ్ వల్ల అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. అందుకే గూగుల్ ప్లాట్ ఫాం వర్చువల్ ట్రయల్స్ చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వర్చువల్ అప్పారెల్ ట్రై ఆన్ అనే టూల్‌ను ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫీచర్. ఇందులో మీ ఫొటో అప్లోడ్ చేస్తే కోట్లకొద్దీ డ్రెస్‌లను వర్చువల్‌గా ట్రై చేయొచ్చు. అంతేకాదు.. గూగుల్ సెర్చ్, షాపింగ్, ఇమేజెస్‌లో డ్రెస్‌లు చూసినప్పుడు ట్రై ఇట్ ఆన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సరి. గూగుల్ కస్టమ్ ఏఐ మోడల్ ఈ టూల్‌పై పని చేసి, మనకు ఆ డ్రెస్‌లు నప్పుతాయో లేదో చూపిస్తుంది. కావాలంటే ఫుల్ లెంగ్త్ ఫొటో అప్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు.
ఈ టూల్ ఎలా వాడాలంటే..
ముందుగా స్టైల్ బ్రౌజ్ చేసి, గూగుల్ సెర్చ్ లేదా షాపింగ్‌లో డ్రెస్‌ల కోసం వెతకాలి. ప్రొడక్ట్ లిస్టింగ్‌లో ట్రై ఇట్ ఆన్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. తర్వాత మీ ఫొటో అప్లోడ్ చేస్తే కొన్ని సెకన్లలోనే ఏఐ మీరు ఎంచుకున్న డ్రెస్‌తో మీ ఫొటోను రియలిస్టిక్‌గా చూపిస్తుంది. కావాలంటే ఆ పిక్చర్‌ను సేవ్ లేదా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాడడానికి18 ఏండ్లు దాటిన వాళ్లే అర్హులు.
►ALSO READ | టెక్నాలజీ: ఆపిల్ వాచ్ లో బీపీ నోటిఫికేషన్.. ఒఎస్ 26 అప్ డేట్.. అలెర్ట్ ఫీచర్ వచ్చేసింది..
