టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. 'ఖిలాడి', 'హిట్ 2' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, గత కొద్దిరోజులుగా మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితం గురించి ఒక రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె యంగ్ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన జంట..
ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తూ, ఇటీవల మీనాక్షి చౌదరి, సుశాంత్ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించారు. బహిరంగ ప్రదేశంలో ఈ జంట కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత పదును పెట్టింది. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అభిమానులు, నెటిజన్లు గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు. వీడియో తెగ వైరల్ అయ్యాయి.
లవ్ రూమర్స్‌పై స్పష్టత!
లేటెస్ట్ గా, ఈ ప్రేమ, పెళ్లి రూమర్స్‌పై మీనాక్షి చౌదరి టీమ్ అధికారికంగా స్పందించింది. వారిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు తేల్చి చెప్పారు. మీనాక్షి చౌదరి, సుశాంత్ కేవలం మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. మీనాక్షి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన విషయాలనైనా సరే, మేమే స్వయంగా అధికారికంగా ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు. సుశాంత్, మీనాక్షి చౌదరి కలిసి 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా, పలు రకాల రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ప్రకటనతో ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.
వరుస సినిమాలతో బిజీగా..
వృత్తిపరంగా మీనాక్షి చౌదరి ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'లో కూడా మీనాక్షి చౌదరి ఒక ముఖ్య పాత్రకు ఎంపికైంది. అనగనగా ఒక రోజు మూవీతో మరో రెండు మూడు చిత్రాల్లో కూడా నటిస్తోంది. లవ్ రూమర్స్‌కు చెక్ పెడుతూనే, ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లలో వరుసగా భారీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ మీనాక్షి చౌదరి తన కెరీర్‌లో దూసుకుపోతోంది.
