ప్రాణం తీసిన చికెన్ ముక్క..గొంతులో చిక్కుకొని ఆటో డ్రైవర్ మృతి

ప్రాణం తీసిన చికెన్ ముక్క..గొంతులో చిక్కుకొని ఆటో డ్రైవర్ మృతి

అన్నం తింటుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి సురేందర్ (42) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం (డిసెంబర్ 7) తో సాయంత్రం ఇంట్లో చికెన్ తో అన్నం తింటుండగా చికెన్ ముక్క ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. చేతితో తీసే ప్రయత్నం చేసే లోపు ఊపిరాడకపోవడంతో ప్రాణాలు విడిచాడు. 

మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.