ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) టెక్నికల్ ఎక్స్పర్ట్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. డిసెంబర్ 19, 20వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పోస్టుల సంఖ్య: 16.
ప్రాజెక్ట్ ఇంజినీర్-సి (పీఈ–సి) 10
పీఈ-–సి (ఎఫ్ఐఎస్ఓ) 02, పీఈ-–-సి (పీఎస్) 01, పీఈ-–-సి (ఎంఎం) 01, పీఈ-–-సి (ఏబీఏపీ) 02, పీఈ-–-సి (పీఎం) 01, పీఈ-–-సి (బీఏఎస్ఐఎస్) 01, పీఈ--–సి (ఎస్డీ) 01, పీఈ-–-సి (హార్డ్‌వేర్/ నెట్ వర్కింగ్) 01,
టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆన్ కాంట్రాక్ట్ (టీఈ–సి) 05
టీఈ-సీ (ఎఫ్ఐసీఓ) 01, టీఈ-సీ (ఎంఎం) 01, టీఈసీ (పీపీ అండ్ క్యూఎం) 01, టీఈ-సీ (ఏబీఏపీ) 01, టీఈసీ(ఎస్ఏపీ జనరల్) 01.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ ఎస్టీలకు 50 శాతం) బీఈ./ బి.టెక్. లేదా సీఎంఏ / సీఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ఎస్ఏపీ మాడ్యూళ్లలో పోస్ట్- క్వాలిఫికేషన్ అనుభవం (ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 3 సంవత్సరాలు, సాంకేతిక నిపుణుడికి 10 సంవత్సరాలు) అనుభవం ఉండాలి. సంబంధిత రంగంలో అప్రెంటీస్‌షిప్ (గరిష్టంగా ఒక సంవత్సరం) ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ప్రాజెక్ట్ ఇంజినీర్ డిసెంబర్ 19, టెక్నికల్ ఎక్స్పర్ట్ డిసెంబర్ 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెయిటేజీ: క్వాలిఫికేషన్‌కు 20 శాతం, సంబంధిత అనుభవానికి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 50 శాతం వెయిటేజీ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
