పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: పార్టీ లైన్​ దాటితే చర్యలు తీసుకుంటామని మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్​ హెచ్చరించారు. నగరంలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 423 గ్రామపంచాయతీలకు ఎన్నికల జరుగుతున్నాయని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలన్నారు. రాబోయే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ప్రతి గ్రామాన్ని మోడల్​ విలేజ్​గా డెవలప్​ చేయడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేస్తున్న క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.