గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని, అన్ని గ్రామాల్లో కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. 

ఆదివారం పెద్దమందడి మండలం అమ్మపల్లి అభ్యర్థి మాధవి, అల్వాల అభ్యర్థి సుదర్శన్​రెడ్డి, వెల్టూర్​ అభ్యర్థి శేఖర్, జగత్​పల్లి అభ్యర్థి గట్టుయాదవ్, మనిగిళ్ల అభ్యర్థి శివయాదవ్, పెద్దమందడి అభ్యర్థి​సూర్యగంగమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  గ్రామాల్లో పర్యటించి తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. సర్పంచులను గెలిపిస్తే ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. 

నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయిస్తున్నామని చెప్పారు. పెబ్బేరు మండలం రామమ్మపేట సర్పంచ్​గా పద్మమ్మ ఏకగ్రీవం కావడంతో, గ్రామానికి ఎస్డీఎఫ్​ నుంచి రూ.20 లక్షలు ఇస్తానని  ప్రకటించారు.