గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమిట్- 2026 సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పలు దేశాల అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధీ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎంతో సమావేశమైన వారిలో మలేషియా పార్లమెంట్ సభ్యుడు ఎం.శరవణన్‌తో పాటు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు నిలి గిల్బర్ట్ (అమెరికా), అమెరికా ప్రభుత్వ సలహాదారు, క్రిటికల్ మినరల్స్ మొమెంటం టెక్నాలజీస్ సీఈఓ మహేశ్ కొండూరు, ఆక్సన్ టెక్నాలజీస్ సీఈఓ అమిత్ మెహ్రా (యూకే), నార్వే మాజీ స్టేట్ సెక్రటరీ దిలెక్, దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు థామస్ ఫ్రోలిక్, శ్రీలంకకు చెందిన సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (సీడబ్ల్యూసీ) అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్ తదితర గ్లోబల్ లీడర్లు ఉన్నారు.
ఏఐ వినియోగం, ఈఎస్జీపై చర్చ..
ఈ భేటీలో పర్యావరణ, సామాజిక, పరిపాలన ప్రాధాన్యతలతో పాటు అత్యాధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా వారికి సీఎం వివరించారు.
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో అనుమతులు గ్లోబల్ ఇన్వెస్టర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యావరణహితమైన విధానాలు, ఏఐ సాంకేతికతను జోడించి రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించడంతో, రాబోయే రోజుల్లో హైదరాబాద్ గ్రీన్ గ్రోత్ ఎకానమీకి ప్రధాన హబ్‌గా మారబోతోందని ఈ భేటీ స్పష్టం చేస్తోంది.
