గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ భేటీ

గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ భేటీ

 హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో  రేవంత్ చర్చించున్నారు.  ప్రభుత్వం తయారుచేసిన  కొన్ని  బిల్లులపై గవర్నర్ తో డిస్కషన్ చేయనున్నారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పెండింగ్ అంశంపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చించనున్నారు రేవంత్. హైదరాబాద్ లో ఉన్న  ఏపీ, తెలంగాణ ఉమ్మడి ఆస్తులపై రేవంత్ గవర్నర్ తో  చర్చించే అవకాశం ఉంది. 

 సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గత మూడు రోజులుగా కాంగ్రెస్ పెద్దలతో పాటు,  పలువురి కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించారు.  ఇవే అంశాలపై ఇవాళ గవర్నర్ తో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.