
హైదరాబాద్, వెలుగు: ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం సుపౌల్‌లో యాత్ర కొనసాగగా.. ఓపెన్ టాప్ జీపులో రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు రేవంత్ రెడ్డి కొద్దిసేపు ప్రయాణించి.. అక్కడి జనాలకు అభివాదం చేశారు. రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, వాకిటి, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటిం చారు. అనంతరం నేతలంతా ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను ప్రియాంక గాంధీ ఆప్యాయంగా పలకరించి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.