తెలంగాణలో యాదవులది కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో యాదవులది కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో యాదవులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదవుల సలహాలు సూచనలతో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపుతామని చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో  సదరన్ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన  సీఎం రేవంత్.. నమ్మిన వాళ్ళ కోసం అండగా నిలబడే తత్వం యాదవుల సొంతమన్నారు.  తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు మంజూరు చేసిందన్నారు .  యాదవ సంఘం పరంగానైనా.. రాజకీయాల్లోనైనా యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.  యాదవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే.. తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు రేవంత్. 

యాదవ సంగంలో బండారు దత్తత్రేయ లాంటి గొప్ప నాయకులు ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు.  యాదవుల సలహాలు సూచనల తో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపుతాం.. హైదరాబాద్ లో శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు రేవంత్. పెట్టుబడులకు ఆదర్శన నగరంగా హైదరాబాద్ మారిందన్నారు.