ఎమ్మెల్యే దొంతి కి సీఎం రేవంత్‍ పరామర్శ..

ఎమ్మెల్యే దొంతి కి సీఎం రేవంత్‍ పరామర్శ..
  • మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 
  • నివాళులు అర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు    

వరంగల్‍, వెలుగు: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి  సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యారు. బుధవారం హనుమకొండ వడ్డెపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‍ నుంచి హెలికాప్టర్‍ ద్వారా వరంగల్​కు చేరుకున్న సీఎం.. రోడ్డుమార్గంలో కార్యక్రమం జరిగిన ఫంక్షన్​ హాలుకు వచ్చారు. కాంతమ్మ ఫొటో వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 

అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాధవరెడ్డిని పరామర్శించినవారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్‍, వివేక్‍ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్‍రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‍, ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్‍, డిప్యూటీ స్పీకర్‍ రామచంద్రునాయక్‍, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్‍, సీఎం సలహాదారు వేం నరేందర్‍రెడ్డి, మేయర్‍ గుండు సుధారాణి, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా,  దొంతి మాధవరెడ్డితో మొదటినుంచి దూరంగా ఉండే కొండా దంపతులు ఈ కార్యక్రమానికి రాకపోవడం కూడా  చర్చనీయాంశమైంది.