- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ఆఫీస్లలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉండాల్సిందేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్ఘటనను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టాలన్నారు.
ఆ ఆఫీస్కల్వకుంట్ల జాగీర్ కాదు, కేసీఆర్ అబ్బ సొత్తు కాదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ ఫొటోలను క్యాంప్ఆఫీస్లలో పెట్టలేదా అని ప్రశ్నించారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ ఫొటో పెడితే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
