పీర్‌‌ షబ్బీర్ సామాజిక సేవకుడు..మాజీ ఎమ్మెల్సీ కుటుంబానికి సీఎం రేవంత్ పరామర్శ

పీర్‌‌ షబ్బీర్ సామాజిక సేవకుడు..మాజీ ఎమ్మెల్సీ కుటుంబానికి సీఎం రేవంత్ పరామర్శ

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ మౌలా నా హఫీజ్​ పీర్‌‌ షబ్బీర్​ సామాజిక సేవకుడని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన రాష్ట్రంలో హిందూ-–ముస్లింలు కలిసి జీవించే మంచి వాతావరణాన్ని సృష్టించారని గుర్తు చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెంది న  మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. సోమవా రం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి షహీన్ నగర్‌ లోని షబ్బీర్​ ఇంటికి సీఎం వెళ్లారు. 

కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “పీర్‌‌ షబ్బీర్​ మరణం ముస్లింలకే కాకుండా, మొత్తం  రాష్ట్రానికే తీరని లోటు. ఆయన సేవలు మరువలేనివి.  మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. అం దుకే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చా. మైనారిటీ సమస్యల పరిష్కారానికి పీర్ షబ్బీర్​ చేసిన కృషి అపూర్వం. ఆయన సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది” అని పేర్కొన్నారు.