తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్​ బాపూజీది కీలక పాత్ర

 తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్​ బాపూజీది కీలక పాత్ర
  • మంత్రి పదవి సైతం వదులుకున్న త్యాగధనుడు: సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు: తొలి, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ కీలక భూమిక పోషించారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 1969లో మంత్రి ప‌‌ద‌‌విని సైతం వ‌‌దులుకున్న త్యాగ‌‌ధ‌‌నుడు బాపూజీ అని కొనియాడారు.  శనివారం కొండా ల‌‌క్ష్మణ్ బాపూజీ వ‌‌ర్ధంతి సందర్భంగా ఆయ‌‌న సేవ‌‌ల‌‌ను శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం గుర్తు చేసుకున్నారు.

నిజాం వ్యతిరేక పోరులో ఓ వైపు పాల్గొంటూనే, మ‌‌రోవైపు బ్రిటిష్ పాల‌‌న‌‌కు వ్యతిరేకంగా వందేమాత‌‌రం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ బాపూజీ భాగ‌‌స్వామి అయ్యార‌‌ని రేవంత్​తెలిపారు. ఎమ్మెల్యేగా,  డిప్యూటీ స్పీక‌‌ర్ గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతోపాటు నిరంత‌‌రం బ‌‌డుగు, బ‌‌ల‌‌హీన‌‌వ‌‌ర్గాల సంక్షేమానికి బాపూజీ త‌‌పించార‌‌ని చెప్పారు.