
రాజీవ్ హయాంలోనే ఐటీ రంగం డెవ్ లప్ అయ్యిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్శిటీపై చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ యువతకు స్కిల్స్ పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ రంగానికి రాజీవ్ పునాదులు వేశారన్నారు. రాజీవ్ హయాంలోనే మాదాపూర్ లో ఐటీ కంపెనీలు ప్రారంభం అయ్యాయని తెలిపారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్:
- పాలనలో రాజీవ్ గాంధీ పారదర్శకత చూపించారు
- అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్సే
- దేశ విదేశాల్లో యువత ఐటీ రంగంలో సత్తాచాటుతున్నారు
- నాడు రాజీవ్ తీసుకున్న నిర్ణయాలే ఈ విజయానికి కారణం
- గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జిల్లాకో వర్శిటీని ఏర్పాటు చేశాయి
- యూపీఏ హయాంలోనే రాష్ట్రంలో ఐటీ అనేక సంస్థలు,వర్శిటీలు ఏర్పాటు
- కాంగ్రెస్ హయాంలోనే ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు
- ఉత్తర తెలంగాణ నుంచి ఇప్పటికే గల్ఫ్ దేశాలు వలసలు
- స్కిల్స్ లేకపోవడం వల్లే కార్మికులు గల్ఫ్ దేశాలకు వలసలు
- నిరుద్యోగ యువతకు స్కిల్స్ నేర్పేందుకు కృషి చేస్తున్నాం
- యంగ్ ఇండియా పేరుతో స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తాం
- మహాత్మ గాంధీ స్పూర్తితో స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం
- యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీలో 17 కోర్సులు..
- యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తున్నాం
- ఏడాదికి కనీస ఫీజు రూ.50 వేలు ఉంటుంది
- అవసరమైతే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తుంది
- ముచ్చెర్లలో 57 ఏకరాల్లో స్కిల్ వర్శిటీకి భూమి పూజ
- 100 కోట్ల రూపాయలతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు భూమి పూజ
- ఒక్కరోజు వేస్ట్ చేయకుండా 6 కోర్సులు స్టార్ట్ చేస్తాం.
- ఈ ఏడాది నుంచి 2 వేల మందికి శిక్షణ ఇస్తాం
- ప్రారంభం కానున్న ఈ కామర్స్, బ్యాంకింగ్ లో ట్రైనింగ్స్
- స్కూల్స్,కాలేజీల్లో యువత డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు
- యువత స్కిల్స్ పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలి
- కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు సభలోలేడు
- మరో రెండు రోజులు సభ నిర్వహణకు మేం సిద్ధం
- ప్రతిపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో తెల్వదు
- అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?
- వాళ్లను నేను సొంత అక్కల్లా భావిస్తున్నా
- ఇపుడు రాజకీయాలు చేయొద్దు
- మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానకరంగా దుష్ప్రచారం చేశారు
- సీతక్కపై బీఆర్ఎస్ నేతల మీమ్స్ చూస్తే చెప్పుతో కొడతారు
- ఆదివాసి బిడ్డను అవమానిస్తే ఊరుకుందామా.
- కేటీఆర్,హరీశ్ లను నమ్మిన సొంత చెల్లలే తీహార్ జైల్లో ఉంది
- సునీతా,సబితా ఇంద్రారెడ్డి కోసం నేను కొట్లాడినా
- వాళ్లను నమ్మొద్దని అక్కలకు చెబుతున్నా
- నన్ను నమ్ముకున్నా అక్కలు ఇవాళ మంత్రులుగా ఉన్నారు
- దళిత స్పీకర్ ముందు కూర్చోలేక సభ నుంచి వెళ్లిపోయారు